టీమిండియా ఓడిపోతే ఇదేం పని శాస్త్రి.. తొలగించండి అంటూ ఫ్యాన్స్..

by Anukaran |
టీమిండియా ఓడిపోతే ఇదేం పని శాస్త్రి.. తొలగించండి అంటూ ఫ్యాన్స్..
X

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఓటమి పాలవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. భారత జట్టు గత కొన్నాళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో ఓటమి పాలవడంపై విమర్శలు వస్తున్నాయి. టీమ్ ఇండియా హెడ్ కోచ్‌ పదవి నుంచి రవిశాస్త్రిని తొలగించాలని కొత్తగా డిమండ్ చేస్తున్నారు. కోహ్లీని కెప్టెన్ పదవి నుంచి తప్పించినా తప్పించకపోయినా రవిశాస్త్రిని మాత్రం కోచ్‌ పదవి నుంచి తప్పించాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు టీమ్ ఇండియా ఓటమి అంచున ఉండటంతో అభిమానులతో పాటు ఆటగాళ్లు ఆందోళగా ఉండగా.. రవిశాస్త్రి మాత్రం డ్రెస్సింగ్ రూం దగ్గర ఏదో తింటూ కనిపించాడు. ఇది అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. మరోవైపు గురువారం న్యూజీలాండ్ జట్టుకు అభినందనలు తెలుపుతూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గెలిచిన జట్టును అభినందించడం బాగానే ఉంది. కానీ అప్పుడప్పుడూ టీమ్ ఇండియాకు కూడా గెలిచే పద్దతి నేర్పించు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story