లంచం ఇవ్వలేదని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

by Sumithra |   ( Updated:2020-10-23 05:32:35.0  )
లంచం ఇవ్వలేదని.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. తమ ఇంటిని అక్రమంగా కూల్చారని నిరసిస్తూ ఓ కుటుంబం మున్సిపల్ ఆఫీసు ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు రెవెన్యూ సిబ్బంది తమను లంచం డిమాండ్ చేశారని, దానికి నిరాకరించడంతో కావాలనే ఇంటిని కూల్చారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ప్రభుత్వ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story