- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా పేషెంట్ల ఆరోగ్యంపై.. కుటుంబ సభ్యుల ఆందోళన
దిశ, హైదరాబాద్: కరోనా బారిన పడి ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలియక వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అధికంగా హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కవగా ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అధికంగా గాంధీ, ఉస్మానియా, కింగ్ కోఠి, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందుతున్నారు. కరోనా అనేది ఇతర రోగాల మాదిరి జబ్బు కాకపోవడం, కంటికి కనిపంచక పోవడం, ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడం వంటివి వేగంగా జరుగుతుండడంతో హాస్పిటల్స్‌లో వైద్య చికిత్సలు పొందుతున్న రోగి వద్ద సహాయకులను ఉండనివ్వడం లేదు. రోగి వెంట ఫోన్‌లు లోనికి అనుమతించినప్పటికీ సిగ్నల్ రాకపోవడం, చార్జింగ్ లేకపోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం ఇతరత్రా కారణాలతో వారు కుటుంబ సభ్యులతో తాము ఎలా ఉన్నామనేది చెప్పలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళనలకు కారణమవుతోంది. దీంతో వారు తీవ్ర మానసిక ఆందోళనలకు గురౌతున్నారు. మరి కొన్ని కేసులలో రోగి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మాట్లాడలేని స్థితిలో ఉంటుండగా వారితో చివరిసారిగా కుటుంబ సభ్యులు, బంధువులు మాట్లాడలేక పోతున్నారు.
ఫోన్‌లు వెంట లేకపోతే అంతే సంగతులు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్న కరోనా పేషెంట్ వెంట సెల్ ఫోన్ లేకపోతే వారు ఎలా ఉన్నారో కూడా తెలియకుండా ఉంది. చివరకు కరోనా కబలించినా వారి గురించి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చే వారు లేరు. గతంలో వనస్థలిపురంకు చెందిన ఓ రోగి, మంగళ్‌హాట్ దూల్ పేట్ ప్రాంతానికి చెందిన మరో రోగి గాంధీ ఆస్పత్రిలో వైద్యం కోసం చేరగా వారి గురించి సమాచారం తెలియక కుటుంబ సభ్యులు గొడవకు దిగిన విషయం తెలిసిందే. వీరిలో వనస్థలిపురంకు చెందిన రోగి కుటుంబ సభ్యులు ఏకంగా హై కోర్టు మెట్లు ఎక్కగా దూల్ పేటకు చెందిన వ్యక్తి గురించి గోషామహల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటే తప్ప వారి మృతి సమాచారం బయట పడలేదు. ఇలా బయటకు ఒక్కటి రెండు సంఘటనలు వస్తుండగా వెలుగు చూడనివి మరిన్ని ఉండే అవకాశాలు లేక పోలేదు.