- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
దిశ, నల్లగొండ: భూవివాదంలో మోతె ఎస్సై పక్షపాతం వహిస్తున్నాడంటూ ఓ కుటుంబం సూర్యాపేట ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్సైని సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన పల్లెల ఈదమ్మ కుటుంబానికి 1984లో బలహీనవర్గాల కోటా కింద సర్వే నంబర్ 232లో 150 గజాల స్థలాన్ని కేటాయించారు. 120 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. మిగిలిన 30 గజాల స్థలంలో గుడిసె వేసుకుంటుండగా… గ్రామానికి చెందిన కొంత మంది అడ్డుకున్నారు. సదరు వ్యక్తులపై ఈ నెల 26న మోతె ఎస్సై గోవర్ధన్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. మూడు రోజులు కావస్తున్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ఎస్సై లంచం అడిగితే తాము ఇవ్వనందున… వైరి పక్షంతో కుమ్మక్కయ్యారని ఈదమ్మ కుటుబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎస్సై అండతో వారు తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగదని భావించిన బాధితురాలు ఇద్దరు కుమారులతో ఎస్పీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన సెంట్రీ వారిని వారించడంతో ప్రమాదం తప్పింది. ఎస్సై గోవర్ధన్‌ను సస్పెండ్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్పీ భాస్కరన్‌కు విజ్ఞప్తి చేశారు. ఘటనపై పూర్తి విచారణకు ఎస్పీ ఆదేశించారు.