సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. ఇద్దరిపై కేసు

by Sridhar Babu |
సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. ఇద్దరిపై కేసు
X

దిశ, కొత్తగూడెం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్య‌క్తి జులై 23న క‌రోనాతో మ‌ర‌ణించాడు. అయితే కుటుంబ స‌భ్యుల‌కు క‌నీసం ల‌క్ష‌ణాలు ఉన్నాయా..? లేదా అని కూడా ప‌రిశీలించలేద‌ని, మృతుడి కుటుంబ స‌భ్యులు వైద్యుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే విష‌యాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ అసత్య ప్రచారాలు చేశారంటూ శుక్ర‌వారం పోలీసుల‌కు స‌ద‌రు కుటుంబ స‌భ్యుల‌పై ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలోని వన్ పట్టణ పోలీసులు ఇద్ద‌రిపై ఐపీసీ 505, 188, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండ‌గా నిజాన్ని నిర్భయంగా అడిగినందుకు మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కుటుంబ స‌భ్యులు దిశ‌కు తెలిపారు. ఈ విష‌యంలో న్యాయపోరాటం చేయడానికి కూడా వెనకాడబోమని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story