- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటమి వైరస్‌లదే.. కానీ!
దిశ, వెబ్‌డెస్క్: సరిగ్గా సాగుతున్న సినిమాలో అనుకోని ట్విస్ట్ వచ్చినట్లుగా కరోనా వైరస్ భూమ్మీద ప్రవేశించింది. దాని ఆగమనంతో ప్రతి రంగం, ప్రతి దేశం, ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారు. పాత అలవాట్లకు బ్రేకులు వేయాల్సి రావడమే కాకుండా కొత్త అలవాట్లను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ బ్రేకులు తాత్కాలికమా? శాశ్వతమా? అనే ఆలోచన ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులను వేధిస్తోంది. అంటే ఇప్పుడు నేర్చుకున్న కొత్త అలవాట్లనే ఇక ఎల్లప్పుడూ పాటించాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో పెరిగింది. అయితే ఇక్కడ నిరాశావాదంగా ఆలోచించడం మానుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. లేదంటే కరోనా వైరస్ కంటే ముందు మానసిక వేదనతో ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందరిలోనూ ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించడానికి ఒకసారి చరిత్రను తిరగేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ చరిత్ర పుటల్లోనుంచే కొన్ని ఉదాహరణలు దొరికాయి. ఈ ఉదాహరణలను మనసుతో చదివితే ఎప్పటికైనా విజయం మనిషిదే, ఓటమి వైరస్‌లదేనని విదితమవుతోంది. ఇంతకీ ఏంటా ఉదాహరణలు?
మొదటి ఉదాహరణగా ‘స్మాల్ పాక్స్’ వైరస్‌ను పరిగణించవచ్చు. మనకు తెలిసిన స్మాల్ పాక్స్ వైరస్ 1970ల కాలంలో పూర్తిగా వాక్సినేషన్ చేయడం ద్వారా నామరూపాలు లేకుండా పోయింది. కానీ దీని కంటే ముందు దాదాపు పురాతన కాలంలో వైకింగ్స్ సామ్రాజ్యం అంతం అవడానికి ఈ వైరస్ కారణమని చరిత్ర చెబుతోంది. ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించి, ఇప్పుడు పూర్తిగా నశించిపోయిందంటే మానవులు విజయం సాధించినట్లే కదా.. ఈ ఉదాహరణ మరీ పురాతన కాలానికి సంబంధించినదిగా ఉంది. అందుకే ఇటీవల వచ్చి, వెళ్లిపోయిన లేదా తీవ్రత తగ్గిపోయిన వైరస్‌ల గురించి మాట్లాడుకుంటే ఎంతో కొంత సానుకూల అనుభూతి కలుగుతుంది.
2003 ఫిబ్రవరి 10న ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక ఈమెయిల్ వచ్చింది. వారం రోజుల్లోనే వంద మందిని పొట్టబెట్టుకున్న ఒక ప్రమాదకర వైరస్ గురించిన ఈమెయిల్ అది. అడవి జంతువులను తినడం మూలంగా వాటి నుంచి మనుషుల్లోకి ప్రవేశించిన సార్స్ వైరస్ సృష్టించిన బీభత్సం అది. రెండేళ్లు గడిచే సరికి 8,096 మందికి సోకగా 774 మంది సార్స్ కారణంగా చనిపోయారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్‌ను తప్పించుకోవడానికి అప్పట్లో చైనాలో మాస్క్‌లు పెట్టుకుని తిరిగారు. హెచ్‌ఐవీ కంటే ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తుందేమోనని అందరూ భయపడ్డారు. కానీ కొద్దికొద్దిగా తగ్గుముఖం పట్టింది. దీనికి కూడా వ్యాక్సిన్ కనిపెట్టి నామరూపాలు లేకుండా చేయగలిగారు.
ఇవి మాత్రమే కాకుండా ప్రపంచాన్ని పట్టి పీడించిన ‘పోలియో వైరస్’ కూడా ఇప్పుడు ఒకటి రెండు దేశాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఆఫ్రికా దేశాలను అల్లకల్లోలం చేసిన ‘ఎబోలా వైరస్’ తీవ్రత కూడా చాలా వరకు తగ్గింది. ఇక అచ్చం కరోనా వైరస్ మాదిరిగానే ఒక నాలుగేళ్ల క్రితం రచ్చ రచ్చ చేసిన ‘స్వైన్ ఫ్లూ వైరస్’ ఏమైందో ఎవరికీ తెలియదు. అంటే సీజన్‌లకు అనుగుణంగా ఒకటి అర కేసులు బయటపడుతున్నప్పటికీ పెద్దగా భయపడాల్సినంత పరిస్థితి రావడం లేదు. కరోనా వైరస్ విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ ఇక్కడ మనుషులు చేస్తున్న తప్పు ఏంటంటే… వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోకముందే ధైర్యంగా బయటతిరుగుతున్నారు. అవును.. అతి ఆశావాహ దృక్పథం కూడా సరైనది కాదు.
వైరస్ ఎదగాలంటే హోస్ట్ కావాలి. ఇలా బయట తిరగడం వల్ల మీరు వైరస్‌కు హోస్ట్‌గా మారే అవకాశం ఉంది. హోస్ట్ నుంచి హోస్ట్‌కు మారే క్రమంలో వైరస్ కొత్త లక్షణాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో తీసుకున్న శాంపిల్స్‌తో వ్యాక్సిన్ తయారుచేస్తే, అది ఉపయోగించే నాటికి వైరస్ లక్షణాలు మారిపోయి వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు. ఎలాగూ వైరస్‌లు ఓటమి పాలవుతున్నాయని చరిత్ర చెప్పింది కదా అని విచ్చలవిడితనం పనికిరాదు. చరిత్రలో వైరస్‌లు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం వల్ల నశించిపోయాయి. కరోనా వ్యాక్సిన్ కూడా తప్పకుండా వస్తుంది. కానీ దానికి మన వంతు సాయం చేయాలి. ఆ వ్యాక్సిన్ తయారయ్యే వరకు కరోనాకు హోస్ట్‌గా పనిచేయకుంటే చాలు.. బయటి తిరిగే వారికి ఎలాగూ ఆశావహ దృక్పథం అతిగానే ఉంది, కానీ వృద్ధులకు, పిల్లలకు కూడా ఆశావహ దృక్పథాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అందుకే నిరాశ పెట్టుకోవద్దు, ఆశ పెట్టుకోండి, కానీ అతిగా పెట్టుకోవద్దు.