- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో మూడ్రోజులు ఇగమే
దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో చలిని భరించలేక ఇండ్లకే పరిమితమయ్యారు. అయితే మరో మూడ్రోజుల పాటు మరింతగా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈశాన్య/తూర్పు దిశ నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో శీతల గాలులు వీచే పరిస్థితులు ఉన్నాయి. శని, ఆదివారం తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటీ రెండు ప్రదేశాల్లో ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లోనూ ఒకటి, రెండు చోట్ల చలి గాలులు వీస్తాయి. మూడు రోజుల తర్వాత వాతావరణ పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. 8.7 డిగ్రీ సెల్సియస్ గా రికార్డయ్యింది. ఆ తర్వాత స్థానంలో మెదక్ ఉంది. అక్కడ 9 డిగ్రీ సెల్సియస్ గా పేర్కొన్నారు.
ఉష్ణోగ్రతలు(డిగ్రీ సెల్సియస్)
జిల్లా గరిష్ఠం కనిష్టం
ఆదిలాబాద్ 29.4 8.7
భద్రాచలం 28.2 17.2
హకీంపేట 28.2 13.8
దుండిగల్ 27.5 13
హన్మకొండ 29 15
హైదరాబాద్ 28.2 14.3
ఖమ్మం 30 15.2
మహబూబ్నగర్ 29 15.5
మెదక్ 31 9
నల్లగొండ 29.4 15
నిజామాబాద్ 29.1 15.1
రామగుండం 29 13