ప్రసాదం ఇవ్వడానికి వచ్చిన బాలికను వదలని దొంగ స్వామీజీ

by Aamani |   ( Updated:2021-06-23 00:34:21.0  )
Gang rape
X

దిశ, వెబ్‌డెస్క్: బాలికపై లైంగిక దాడి చేశాడు ఓ దొంగ స్వామీజీ. ఈ దారుణ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని ఓ తండాలో వెలుగుచూసింది. ఇదే మండలంలో ఓ కొండపై బ్రహ్మనిష్ఠ శ్రీ సంత్ ఆత్మారాం మహారాజ్ పేరుతో బాబా అవతారం ఎత్తాడు ఓ వ్యక్తి. ఈ నేపథ్యంలోనే దొంగ స్వామీజీ మాటలు నమ్మిన మండలంలోని ఓ తండా వాసులు అతడికి ఆశ్రయం ఇచ్చారు. ఓ గుడిలో ఉండేందుకు అన్ని వసతులు కల్పించారు.

ఇదే క్రమంలో ఈ నెల 16న తండాకు చెందిన ఓ కుటుంబం అతడికి ప్రసాదం, నీళ్లు ఇచ్చేందుకు 16 ఏండ్ల కూతురిని పంపారు. మైనర్ ఒంటరిగా వస్తుందని గమనించిన దొంగ స్వామీజీ గుమ్మం వద్దకు రాగానే లోపలికి పిలిచాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో స్పృహ కోల్పోయిన బాలిక ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో స్వామీజీ ఇంటికొచ్చారు తల్లిదండ్రులు. తలుపులు కొట్టినా ఎంతకీ తెరువకపోవడంతో చివరకు బద్దలు కొట్టి చూడగా.. బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు దొంగ స్వామీజీని దేహశుద్ధి చేయగా అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఇదే విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story