- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ కావాలనే కోరికను అలా తీర్చుకున్నాడు.. చివరికి
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : డాక్టర్ కావాలనే తపనతో ఇంటర్మీడియట్‌లో బైపీసీ కోర్సు తీసుకుని పలు మార్లు ఎంసెట్ పరీక్షలు రాసినా ఎంబీబీఎస్ అర్హత మార్కులు సాధించలేకపోయాడు. దీనికితోడు తనతో చదివిన మిత్రులు ఎంబీబీఎస్‌లో సీటు సాధించి వైద్యులుగా కొనసాగుతుండడంతో తాను కూడా ఎలాగైనా డాక్టర్ కావాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కొంత మంది మిత్రులను కలిసి తన కోరికను వెల్లడించాడు. ఎంబీబీఎస్ చదవకున్నా అనుభవం ఉంటే డాక్టర్‌గా చెలామణి కావచ్చని భావించాడు. వృత్తి అనుభవం కోసం వందలాది మంది వైద్యులు ఉండే ఉస్మానియా ఆస్పత్రిలో అయితే తనను ఎవరూ గుర్తించరని భావించి యాప్రాన్ ధరించి మెడలో స్టెత్ స్కోప్‌తో ప్రవేశించిన ఓ నకిలీ డాక్టర్ పై అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఎస్.ఐ బాలస్వామి కథనం ప్రకారం.. చాంద్రాయణ్ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన మర్వన్ బిన్ అబ్ధుల్ అజీజ్ (27) కు డాక్టర్ కావాలని చిన్నతనం నుండే తపన పడేవాడు. అయితే ఎంసెట్‌లో ర్యాంక్ సాధించకపోవడంతో తనలోని కోర్కెను చంపుకోలేక యాప్రాన్ ధరించి మెడలో స్టెత్‌తో మంగళవారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నాడు. వార్డులలో తిరుగుతుండగా విధులలో ఉన్న డాక్టర్ జీ ప్రణిత అతనిని అనుమానంతో ప్రశ్నించింది. సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆర్ఎంఓ డాక్టర్ సిద్ధిఖీకి సమాచారం అందించింది. దీంతో మర్వన్ అబ్ధుల్ అజీజ్‌పై ఆయన అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించడంతో చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.