- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు రాష్ట్రాల్లో నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపులు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల్లో ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ వ్యాక్సిన్ క్యాంపులు నిర్వహించినట్లు గుర్తించామని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. ‘అదనపు చర్యగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సరఫరాలో అప్రమత్తతను పెంచాలి. అంతేకాకుండా అటువంటి అసాంఘిక కార్యకలాపాల నుండి రక్షణ కల్పించడానికి టీకా ఉత్పత్తి భౌతిక పరిస్థితిని జాగ్రత్త పరచాల్సి ఉంది’ అని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారి వివరాలు కోవిన్ పోర్టల్‌లో పొందుపరుస్తున్నామని వెల్లడించారు. దీంతో పాటు డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నామని చెప్పారు.