నిర్మాత దిల్ రాజుకు భారీ షాక్..

by Shyam |
Dil-Raju
X

దిశ, వెబ్‌డెస్క్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ.. ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు షాక్ తగిలింది. ఆయన పేరుతో ట్విట్టర్‌లో నకిలీ అకౌంట్స్ ఉన్నట్లు తెలిసింది.

ఈ విషయం ఆయన టీం దృష్టికి రావడంతో ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజుకు ట్విట్టర్ లో ఎలాంటి స్పెషల్ అకౌంట్ లేదని, @SVC_Official అనేది మాత్రమే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు అధికారిక ట్విట్టర్ అకౌంట్ అని ప్రకటించారు.

Advertisement

Next Story