'పుష్ప' విలన్ కి పెను ప్రమాదం.. అదృష్టమేనంటున్న హీరో

by Anukaran |   ( Updated:2021-06-17 03:00:07.0  )
fahad fazil accident
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘మలయాన్‌కుంజు’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ఎత్తునుంచి కిందకి పడిపోయానని, అదృష్టవశాత్తు తలకి దెబ్బతగలకుండా తన చేతులను అడ్డుపెట్టడంవలన పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పుకొచ్చాడు.

సాధారణంగా ఎత్తు నుంచి కింద పడేటప్పుడు చేతులు ముందుకు చాచడం అంత ఈజీ కాదని, కానీ అదృష్టవశాత్తూ ఆ సమయంలో నా మెదడు చురుగ్గా పని చేయడంతో బతికిపోయానన్నాడు. కానీ, ఈ ప్రమాదంలో తన ముక్కుకు గాయం కావడం వలన మూడు కుట్లు కూడా పడ్డాయని చెప్పారు. ఏదైమైనా అదృష్టం కొద్దీ బయటపడ్డానని, గాయం నొప్పి తగ్గడానికి కొంత సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు తన కొత్త సినిమా ‘మాలిక్’ ఓటిటీలో వచ్చే అవకాశముందని తెలిపారు. ఇకపోతే ఈ వర్సటైల్ హీరో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అల్లు అర్జున్ కి ధీటైన విలన్ గా కనిపించనున్నాడు.

Advertisement

Next Story