'పుష్ప' విలన్ కూడా తగ్గేదేలే.. భయంకర లుక్ లో మలయాళ నేచురల్ స్టార్

by Anukaran |   ( Updated:2021-08-28 05:15:00.0  )
పుష్ప విలన్ కూడా తగ్గేదేలే.. భయంకర లుక్ లో మలయాళ నేచురల్ స్టార్
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై మేకర్స్ రోజురోజుకు అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే రగ్గడ్ లుక్ లో బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన దాక్కో దాక్కో మేక రికార్డులను కొల్లగొట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎట్టకేలకు ‘పుష్ప’ విలన్ ఫహద్ ఫాజిల్ లుక్ ని రివీల్ చేశారు. ఆయన బర్త్ డే కి కూడా నార్మల్ గా విష్ చేసిన మేకర్స్ సడెన్ గా, ఏ బజ్ లేకుండా ఫహద్ లుక్ ని రివీల్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

“మోస్ట్ టాలెంటెడ్ ఫహద్ ఫాజిల్ మన పుష్పరాజ్ తో ఢీ కొట్టడానికి IPS భన్వర్ సింగ్ షెకావత్ గా వస్తున్నాడని” ”పుష్ప” మేకర్స్ పేర్కొన్నారు. ఇక ఫహాద్ ఈ లుక్ లో చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. గుండు, దానిపై గాటు, సీరియస్ లుక్ తో చూడగానే ఖైదీలు భయపడేవిధంగా ఉన్నాడు. సుకుమార్ సినిమాలలో హీరోలే కాదు విలన్స్ కూడా ప్రత్యేకంగానే ఉంటారని మరోసారి నిరూపించాడు. ఇక ఈ ఫహద్ లుక్ చూశాక పుష్ప యాక్షన్ సీన్స్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేసే పుష్ప రాజ్ బృందాన్ని వేటాడే పోలీస్ గా ఫహద్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలిభాగాన్ని ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://twitter.com/MythriOfficial/status/1431476184836050944

Advertisement

Next Story