- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జస్ప్రిత్ బూమ్రా కాబోయే భార్య ఈమేనా? ఆమె గురించి మీకు తెలియని విషయాలు?
దిశ,వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో జరిగే పెళ్లి కోసం జస్ప్రిత్ ఇప్పటికే గోవాలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ పేసర్ ఎవరిని పెళ్లాబోతున్నాడంటూ నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో కొంతమంది టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను పెళ్లి చేసుకుంటున్నాడంటే, మరికొందరు సంజనా గణేషన్ ను వివాహం చేసుకుంటున్నాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుసు కాబట్టి సంజనా గణేషన్ ఎవరు? ఆమె ఏం చేస్తుంటారోనని తెలుసుకునేందుకు ఔత్సాహికులు ఉత్సాహం చూపిస్తున్నారు.
సంజనా గణేషన్ ఎవరు?
28ఏళ్ల సంజనా గణేషన్ స్టార్ స్పోర్ట్స్ తరుపున ఐపీఎల్ తో పాటూ ఇతర స్పోర్ట్స్ హోస్ట్ గా, పనిచేస్తున్నారు.
స్పోర్ట్స్ యాంకర్
ఈ స్టార్ స్పోర్ట్స్ యాంకర్ గతంలో పలు టీవీ షోల్లో పనిచేశారు. ప్రముఖ ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్ విల్లా7 లో గాయం కావడంతో ఆమె ఆ షో నుంచి వైదొలిగారు.
మోడలింగ్ లో
సంజనా గణేషన్ యాంకర్ గా, రియాలిటీ షోల్లో పనిచేయకముందే మోడల్ గా పనిచేశారు. ‘2012 ఫెమినా స్టైల్ దివా’ ఫ్యాషన్ షోలో పనిచేశారు. దీంతో పాటూ 2013లో ఫెమినా మిస్ ఇండియా పూణే కాంపిటీషన్ ఫైనలిస్ట్ లో ఒకరుగా నిలిచారు.
ఫెమీనా అఫీషియల్ గార్జియస్
2012లో జరిగిన ఫెమీనా అఫీషియల్ గార్జియస్ కాంపిటీషన్ టైటిల్ ను గెలుచుకున్నారు. 2013లో ఎంటీవీ స్పిట్ల్స్ విల్లా సీజన్ 7లో ప్రత్యక్షమయ్యారు. రెండేళ్ల తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా తన కెరియర్ ను ప్రారంభించారు.
వరల్డ్ కప్ లో యాంకర్ గా
క్రికెట్ వరల్డ్ కప్లో యాంకర్గా పనిచేశారు. అదే సమయంలో ఇంగ్లాండ్ కు వెళ్లి అక్కడ క్రికెట్ అభిమానులతో వరల్డ్ కప్ గురించి అభిప్రాయాల్ని తెలుసుకున్నారు.
ఐఎస్ఎల్, ఐపీఎల్ వేలం పాటలో హోస్ట్ గా
2018లో జరిగిన ఐఎస్ఎల్, ఐపీఎల్ లీగ్ లో జరిగిన వేలానికి హోస్ట్ గా వ్యవహరించారు.
ద నైట్ క్లబ్
సంజనా గణేషన్ ఎక్స్ క్లూజీవ్ గా కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ టీమ్ తరుపున ద నైట్ క్లబ్ షోకి హోస్ట్ గా పనిచేశారు. కేకేఆర్ ఫ్యాన్స్ టీమ్ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యేలా ద నైట్ క్లబ్ షో ను స్టార్ట్ చేశారు. ఆ షోకి సంజనా గణేషన్ హోస్ట్ గా పనిచేసి తన మాట తీరుతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఆరాధ్య దేవతగా నిలిచారు.