- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూజర్ ప్రైవసీకి మెసెంజర్‌లో న్యూ ఫీచర్స్
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్‌చాట్.. వంటి సోషల్ మీడియా యాప్స్ వాడకం ప్రస్తుతం కామన్ అయిపోయింది. వాటిల్లో వచ్చే నోటిఫికేషన్లను మనం తరచూ చెక్ చేస్తుంటాం. అందువల్లే వాటిని దాదాపుగా లాక్ చేయం. కానీ వాట్సాప్, మెసెంజర్ వంటి యాప్స్‌లో ప్రైవేట్‌గా మెసేజ్‌లు పెడుతుంటాం. పై అధికారులతో చాట్ చేస్తుంటాం. కొన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. అందువల్ల వాటికి లాక్ ఉంటేనే ఆ సమాచారమంతా సేఫ్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌నకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఫింగర్ ఫ్రింట్, ఫేస్ రికగ్నైజేషన్‌లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్‌కు పాస్‌వర్డ్ పెట్టుకోవడం కామన్. అదే తరహాలో ఫేస్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్ లాక్‌లు కూడా పెట్టుకోవడం సర్వసాధారణం. కానీ చాలా తక్కువ మంది యాప్స్‌కు పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. ఈ ఫీచర్‌తో ఫోన్ అన్‌లాక్ చేసినా.. ఆయా యాప్‌లను ఓపెన్ చేయాలంటే యూజర్ ప్రత్యేకంగా పెట్టుకున్న పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ తరహా యాప్‌లాక్ యాప్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీవే ఉంటాయి. వాటి వల్ల ఫోన్ డ్యామేజ్ కావచ్చు. అందువల్ల ఫేస్‌బుక్ అధికారిక ఫేస్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్ లాక్ యాప్స్ తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఐవోఎస్ డివైజ్‌లలో ఈ ఫీచర్‌ను టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా త్వరలోనే ఆండ్రాయిడ్‌లోనూ టెస్ట్ చేసి.. రిలీజ్ చేయనుందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.