- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేస్‌బుక్ న్యూ ‘వ్యాక్సినేషన్ ఫ్రేమ్స్’.. ఫర్ అవేర్‌నెస్
దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తోంది. అయితే కరోనాను నిరోధించడానికి జనవరి 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. తాజాగా 45 ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా ఇవ్వడం ఇటీవలే ప్రారంభించగా, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు టీకా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘వ్యాక్సినేషన్’ ప్రొగ్రామ్‌ను మరింత ప్రొత్సహించడానికి ‘ఫేస్‌బుక్’ న్యూ ప్రొఫైల్ ఫ్రేమ్స్, స్టిక్కర్స్ తీసుకొచ్చింది. ఇలాంటి చర్యలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని ఫేస్‌బుక్ అభిప్రాయపడుతోంది.
ఫేస్‌బుక్ విడుదల చేసిన ఫీచర్లలో కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రొఫైల్ ఫ్రేమ్స్, కొత్త స్టిక్కర్స్ ఉంటాయి. ఇందులో భాగంగా ‘ఐ గాట్ మై కొవిడ్ 19 వ్యాక్సినేషన్, లెట్స్ గెట్ వ్యాక్సినేటెడ్, వి కెన్ డూ దిస్’ అనే కోట్స్‌తో ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి. న్యూస్ ఫీడ్‌లో కొవిడ్ -19 వ్యాక్సిన్ ఫ్రేమ్‌లను ఉపయోగిస్తున్న వ్యక్తుల సారాంశాన్ని కూడా ఫేస్‌బుక్ చూపిస్తుంది. ఫేస్‌బుక్‌లో 25శాతం మంది ఇప్పటికే ఈ కొత్త ప్రొఫైల్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నారని ఎఫ్‌బీ తెలిపింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్‌ఎస్), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) భాగస్వామ్యంతో ఫేస్‌బుక్ ఈ ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఇక ఇన్‌స్టా స్టోరీల్లోనూ ‘టీకాలు వేద్దాం’ అనే స్టిక్కర్ అందుబాటులో ఉంది.
‘కొత్త ఫ్రేమ్‌లు కొవిడ్-19 (COVID-19) వ్యాక్సిన్లకు మద్దతును పంచుకునేందుకు మనల్ని అనుమతిస్తాయి. మనం గౌరవించే, శ్రద్ధ వహించే ఇతరులు కూడా వ్యాక్సినేషన్‌లో భాగం కావాలని సూచిస్తాయి’ అని ఫేస్‌బుక్ అఫీషియల్ బ్లాగులో తెలిపింది. జాతీయ, ప్రపంచ ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజలను త్వరగా చేరుకోవడంతో పాటు నమ్మకం కూడా పెరుగుతోంది. ప్రజలు విశ్వసనీయ సమాచారం పొందడానికి, టీకాలు వేయించుకోవడానికి, ఇతరులను వ్యాక్సినేషన్‌లో భాగం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని ఫేస్‌బుక్ పేర్కొంది.