మెసెంజర్‌ లుక్‌లో ఇన్‌స్టాగ్రామ్

by Harish |
మెసెంజర్‌ లుక్‌లో ఇన్‌స్టాగ్రామ్
X

దిశ, వెబ్ డెస్క్ :
ఇన్‌స్టాగ్రామ్‌ (instagram) ఇక ముందు కొత్తగా కనిపించనుంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ (whats app), మెసెంజర్‌ (messanger)లను ఇంటిగ్రేట్ చేసేందుకు ఫేస్‌బుక్ ప్లాన్ చేస్తున్నట్లు.. మార్క్ జుకర్ బర్గ్ గత సంవత్సరమే వెల్లడించారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ చేస్తే.. మెసెంజర్ తరహాలో కనిపించనుండటం విశేషం.

ఇన్‌స్టా న్యూ అప్‌డేట్‌లో ప్రధానంగా చాట్ టెక్ట్స్ కలర్‌ఫుల్ లుక్‌లో కనిపించనుంది. దీంతో పాటు ఎమోజీ రియాక్షన్స్, స్వైప్ టూ రిప్లయ్ టూ మెసేజెస్, చాట్ విత్ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన విశేషమేమిటంటే.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో చాట్ చేయొచ్చు. ఈ అప్‌డేట్ మరికొన్ని రోజుల్లో ఇండియన్ యూజర్లకు రానుంది. అంతేకాదు ఇన్‌స్టాలోని డీఎమ్( DM) ఐకాన్.. మెసెంజర్ ఐకాన్‌గా ఉండనుంది. ఇన్‌స్టాలోని చాట్స్ ఇకపై బ్లూ, పర్పుల్ రంగుల్లో కలర్‌పుల్‌గా కనిపించనున్నాయి.

ఈ అప్‌డేట్ గురించి ఇప్పటివరకైతే ఫేస్‌బుక్ అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అంతేకాదు వాట్సాప్, మెసెంజర్, ఇన్‌స్టా.. ఈ మూడింటిని యూనిఫై చేయడానికి ఫేస్‌బుక్ ప్లాన్స్ చేస్తోంది. ఓ యాప్‌లో ఉంటూనే.. ఆ యాప్ నుంచి ఎగ్జిట్ కాకుండా ఇతర రెండు యాప్‌లకు మెసేజ్ చేసేలా కసరత్తులు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed