- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న సంస్థలు, స్టార్టప్ కంపెనీలకు రుణాలిస్తానంటున్న ఫేస్‌బుక్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లకు ప్రయోజనాలు కలిగే విధంగా కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌పై వాణిజ్య ప్రకటనలు ఇచ్చే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వారికి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని, శుక్రవారం నుంచే రుణాలివ్వడం ప్రారంభిస్తున్నట్టు ఫేస్‌బుక్ ఇండియా ప్రకటించింది. దీనికోసం ప్రముఖ ఆన్‌లైన్ లోన్ ప్లాట్‌ఫామ్ సంస్థ ‘ఇండిఫై’తో ఒప్పందం చేసుకుంది. ఈ కొత్త కార్యక్రమాన్ని ‘స్మాల్ బిజినెస్ లోన్స్ ఇనిషియేటివ్’గా తీసుకొస్తున్నట్టు ఫేస్‌బుక్ ఇండియా వెల్లడించింది.
రానున్న రోజుల్లో మరిన్ని ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్టు స్పష్టం చేసింది. భారత్‌లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా ఫేస్‌బుక్ మొదలుపెట్టడం విశేషం. దేశీయంగా మొత్తం 200 పట్టణాల్లో రిజిస్టర్ అయిన కంపెనీలకు ఈ సేవలు అందుతాయని ఫేస్‌బుక్ చెబుతోంది. రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య చిన్న వ్యాపారులు, స్టార్టప్‌లకు రుణాలివ్వనున్నట్టు వివరించింది. ఈ రుణాలపై 17-20 శాతం మధ్య వడ్డీ ఉంటుందని, మహిళలకు ఈ వడ్డీ రేటులో 0.2 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇస్తున్న అనేక స్టార్టప్ సంస్థలు పెట్టుబడుల విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని మేము గుర్తించాం. చిన్న వ్యాపారులకు, స్టార్టప్‌లకు అండగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నామని ఫేస్‌బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజిత్ మోహన్ చెప్పారు. మొదటి విడతలో భాగంగా శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో అమలు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా కనీసం 3,000 మందికి ఈ రుణాలు ఇవ్వాలని కంపెనీ లక్ష్యంగా ఉంది.