గ్రామబహిష్కరణలో 6కుటుంబాలు..

by srinivas |   ( Updated:2020-02-20 05:49:55.0  )
గ్రామబహిష్కరణలో 6కుటుంబాలు..
X

చిత్తూరు జిల్లాలో అమానవీయ కోణం వెలుగుచూసింది.ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వలేదనే నెపంతో 6 కుటుంబాలను ఆ ఊరి గ్రామపెద్దలు బహిష్కరించారు.ఈ ఘటన గురువారం వి.కోట మండలం ఎగువ చౌడేపల్లిలో చోటుచేసుకుంది. అంతేకాకుండా బహిష్కరణకు గురైన కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదని, వారిని కలువకుండా ఉండేందుకు ఆరు ఇళ్ల చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయించారు. దీంతో బాధితులు ఏం చేయాలో తెలియక స్థానిక తహశీల్దార్ మురళిధర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన అధికారులను వెంట బెట్టుకుని వెళ్లి ముళ్ల కంచెలను తొలగించారు.

Advertisement

Next Story

Most Viewed