ఏరియల్ స్పేస్ మిషన్ విశేషాలు

by Harish |
ఏరియల్ స్పేస్ మిషన్ విశేషాలు
X

దిశ, వెబ్‌డెస్క్: యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ఇటీవల ఏరియల్ ఎక్స్‌ప్లోరర్‌ను అడాప్ట్ చేసుకుంది. ఇది బాహ్యగ్రహాల పరిస్థితిని ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి రూపొందించిన మిషన్. ఇప్పటివరకు దాదాపుగా 4,000 బాహ్యగ్రహాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని వేల బాహ్యగ్రహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల అంచనా. ఇందుకోసం పరిశోధనలను ముమ్మరం చేయడానికి ఈఎస్ఏ ఈ ఏరియల్ ఎక్స్‌ప్లోరర్ మిషన్‌ను ప్రారంభించింది. ఈ బాహ్యగ్రహాల్లో జీవించడానికి అనువుగా ఉన్న గ్రహాలను గుర్తించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రకారంగా చూస్తే ప్రాక్సిమా సెంటారీ బి అనే గ్రహం భూమికి దగ్గరగా ఉన్నది. ఇది నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న హాబిటబుల్ జోన్‌గా దీన్ని గుర్తించారు. దీని ఉపరితలం మీద ద్రవరూపంలో నీరు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

సౌరకుటుంబంలో కాకుండా ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతూ ఉన్న గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఇవి అత్యంత కాంతివంతంగా ఉంటాయి కాబట్టి వీటిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఇవి నక్షత్రాల లేదా గ్రహాల అని తెలుసుకోవడానికి చాలా నిరూపణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అందుకే వీటి మధ్య తేడాను గమనించడం కష్టతరమవుతుంది. ఈ ఏరియల్ మిషన్ ద్వారా బాహ్యగ్రహాలను గుర్తించే వీలుకలుగుతుంది. ఇవన్నీ టెలీస్కోప్‌ల ద్వారా కనిపిస్తాయి. కానీ, వాటి మధ్య తారతమ్యాన్ని గుర్తించడం కష్టం. గ్రావిటేషనల్ లెన్సింగ్, కక్ష్యలో తిరిగే విధానాలను బట్టి వీటిని గుర్తిస్తారు. భూమ్మీద కాకుండా ఇతర గ్రహాల్లో కూడా జీవజాలం ఉందని నిరూపించడానికి శాస్త్రవేత్తలు ఇలా బాహ్య గ్రహాల మీద ప్రయోగాలు చేస్తున్నారు.

Advertisement

Next Story