త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ : విజయసాయిరెడ్డి

by srinivas |
viijayasai-reddy 1
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో మూడు రాజధానుల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. త్వరలోనే మూడు రాజధానులు ఆయా జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు. ముహూర్తం ఇంకా నిర్ణయం కాలేదని.. కానీ, విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావడం మాత్రం ఖాయమని నొక్కిచెప్పారు. అందుకు సంబంధించిన సంకేతాలు కూడా అందుతున్నాయన్నారు.

ఇదిలాఉండగా, జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే మూడు రాజధానుల అంశంపై కీలక ప్రకటన చేశారు. అందులో లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతి కేంద్రంగా, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలు కేంద్రంగా న్యాయవ్యవస్థ కొనసాగుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story