- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిషేధించింది. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన ఓ ఎక్సైజ్ సీఐ మద్యం అక్రమ తరలింపునకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యారు. అంతేకాకుండా ఆయనపై రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగింది. కుతుకులూరు మారుతీనగర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సీల్ వేయాలంటూ రాయవరం ఎక్సైజ్ సీఐ రెడ్డి త్రినాథ్‌రావు ఆదివారం అక్కడికి వచ్చారు. సీఐ వాహనంతో పాటు, ఇంకా రిజిస్ట్రేషన్ కాని
వాహనంలో మరికొందరు వచ్చారు. రూ.1.5 లక్షల మద్యం బాటిళ్లను ఆ వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. తమకు ఇబ్బంది అవుతుందని షాపు సూపర్‌వైజర్లు జె.శేఖర్, షేక్ మౌషీ చె ప్పినా తాను చూసుకుంటానంటూ సీఐ మద్యం బాటిళ్లను వాహనాల్లో వేశారు. స్థానికులు అడ్డుకోబోగా సీఐ తన సొంత వాహనాన్ని డ్రైవర్ అక్కడి నుంచి వేగంగా తరలించాడు. మద్యం సీసాలతో మరో వాహనాన్ని స్థానికులు అడ్డుకుని అనపర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసి, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్య నారాయ ణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం అక్ర మ తరలింపుపై సీఐ త్రినాథ్‌ను నిలదీశారు. తనకు ఎటువంటి సంబంధం లేదని, గ్రామంలో మద్యం తరలింపుపై సమాచారం రావడంతోనే తాను వచ్చానని,
షాపు సూపర్‌వైజర్ల తనపై బురద జల్లుతున్నారని సీఐ చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా సీఐ త్రినాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ సూపరింటిండెంట్ ప్రభుకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: Excise CI, suspension, illegal, evacuation, alcohol, East godavari