- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాంద్రా ఘటన ఏమాత్రం సమర్థనీయం కాదు: భజ్జీ
ముంబై: లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించడంతో ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో వలస కార్మికులు మంగళవారం ఆందోళకు దిగగా.. ఈ ఘటనపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నాడు. ఇలా రోడ్లపైకి పెద్దఎత్తున రావడం ఏమాత్రం సమర్థనీయం కాదని వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ..‘‘బాంద్రా రైల్వే స్టేషన్‌లో నిన్న జరిగిన ఘటన ఆందోళనకు గురిచేసింది. దీన్ని ఏమాత్రం అంగీకరించలేం. ప్రతి ఒక్కరినీ ఇంటికి పరిమితం చేయడానికే లాక్‌డౌన్ ప్రకటించారు. వలస కార్మికులు ఈ విపత్కర పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. వారితో పాటు ఇతరులనూ ప్రమాదంలోకి నెట్టుతున్నారు.’’ అని పేర్కొన్నాడు. కాగా, భోజనం, వసతి ఏర్పాట్లు కల్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వలస కార్మికులు ఆందోళన విరమించిన సంగతి తెలిసిందే.
Tags: bandra incident, harbhajan singh, tweet, cricketer