మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

by Sumithra |
మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
X

దిశ, తాండూర్: పెద్దేముల్ మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాణిశ్రీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్ గ్రామంలో ఉదయం హనుమాన్ దేవాలయం వద్ద గ్రామ పెద్దల మధ్య పంచాయితీ కొనసాగుతుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వీరప్పపై రాళ్లతో దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరప్పను తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. హత్యకు సంంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరప్ప హత్య విషయం తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed