- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో కొత్త పార్టీ? 'దిశ'తో కొండా ఏం చెప్పారంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి త్వరలో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నారు. ఈ మేరకు ఆయన ఫోన్‌లో తన అనచరులకు సమాచారం ఇచ్చారు.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు, త్వరలో బీజేపీలో చేరనున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ‘దిశ’తో ఫోన్‌లో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదని, మూడు నెలల పాటు ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కొండా తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై కొండా మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ పార్టీ సరిగ్గా నిర్వహించలేకపోతుందని, ప్రజల సమస్యలను ఎత్తి చూపడంలో సక్సెస్ కావడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ తండ్రీ కొడుకులదేనని, తెలంగాణ ప్రజల కోసం ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తాను మూడు నెలల పాటు రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేస్తానని, ఆ తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై ఆలోచిస్తానన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మిత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటానన్నారు.
కాగా, 2013లో కేసీఆర్ పిలుపుతో కొండా విశ్వశ్వరరెరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి 75 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 నవంబర్ 21న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన.. అదే నెల 23న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఆ పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కొండా ఉన్నట్లు తెలుస్తోంది.