- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కారు కేసీఆర్‌దైనా స్టీరింగ్ ఒవైసీదే !
• మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్
దిశ,న్యూస్‌బ్యూరో:
రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది కారు పార్టీ అధినేత కేసీఆర్ అయినా.. కారు స్టీరింగ్ మాత్రం అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే కళ్లు పీకేస్తానని గుడ్లురిమిన కేసీఆర్.. పాతబస్తీలో దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైతే కనెత్ని చూసే సోయిని కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాములు నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభాగ్యురాలిపై అత్యాచారం చేసిన షకిల్ ఎంఐఎం నాయకుడు కాబట్టే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎంఐఎం అంటే భయమని ఎద్దేవా చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒవైసీ సోదరులు హర్ట్ అవుతారని కేసీఆర్ భయపడుతున్నారని రాములు నాయక్ విమర్శించారు. పవిత్ర రంజాన్ మాసంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటి వెనకాలే అత్యాచార ఘటన జరిగిందని తెలిసినా.. బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయారన్నారు. అదే ప్రియాంకారెడ్డి ఇంటికి పోయి పరామర్శించిన హోం మంత్రి.. దళిత బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.