- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా తో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి
దిశ ప్రతినిధి, ఖమ్మం : కమ్యూనిస్టు యోధుడు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) సోమవారం అర్ధరాత్రి ఒంటిగంటకు మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను విజయవాడలోని కొవిడ్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గత 10 రోజులుగా రాజయ్య జ్వరంతో బాధపడుతుండగా స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో వైద్య చికిత్స పొందుతున్నారు.
ఇటీవల ఆయన కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్ వచ్చినా ఈయనకు మాత్రం నెగెటివ్ వచ్చింది. తరువాత డెంగీగా నిర్ధారించి, చికిత్స అందించారు. అయినా తగ్గకపోవడంతో సోమవారం భద్రాచలంలో మరోసారి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వెలుగుచూసింది. ఈ క్రమంలో విజయవాడ తరలించడంతో పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈయన భద్రాచలం శాసనసభ్యుడిగా సీపీఎం తరఫున 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా రంపచోడవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా ఉన్న రాజయ్య మృతితో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగి పోయాయి.