మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత

by Aamani |
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత
X

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య గురువారం ఉదయం తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సమ్మయ్య సుదీర్ఘకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో సేవలందించారు. సిర్పూర్ నియోజవకవర్గం నుంచి రెండు సార్లు 2009, 2011లో టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికల ముందు తన భార్య సాయిలీలతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాగా, సమ్మయ్య మరణవార్త తెలిసిన సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

tag;ex mla, kaveti sammaiah, dead, adilabad, ts news

Advertisement

Next Story