ఫారెస్ట్ అధికారుల నిర్బంధం.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి హస్తం..!

by Sampath |
ఫారెస్ట్ అధికారుల నిర్బంధం.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి హస్తం..!
X

దిశ, కుత్బుల్లాపూర్ : అటవీ శాఖ భూమిని కబ్జా చేస్తున్నారని.. నోటీసులిచ్చేందుకు వెళ్లిన అధికారులను కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే సోదరుడి మనుషులు నిర్బంధించారు. గాజులరామారం సర్వే నెంబర్ 29లో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుటుంబానికి కొంత పట్టా భూమి ఉంది. అయితే అతని సోదరుడు జైకుమార్ గౌడ్ ఆ భూమిని చదును చేస్తున్నామని చెప్పి పక్కనే ఉన్న సర్వే నంబర్ 19 అటవీ శాఖ భూమిని సైతం చదును చేసే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో మంగళవారం జైకుమార్, అటవీ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువురు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అయితే భూమిని చదును చేస్తున్న వారికి బుధవారం ఫారెస్ట్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి , రవీంద్ర చారిలు నోటీసులు అందజేసేందుకు షాపూర్ నగర్‌లోని జైకుమార్ నివాసానికి వెళ్ళారు. జైకుమార్ లేకపోవడంతో అక్కడున్న అతని అనుచరులు నోటీసులు తీసుకోకుండా అధికారులను గదిలో నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఓ శ్రీదేవి సదరు వ్యక్తులపై కేసునమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed