వాళ్లు చెబితే హుజురాబాద్‌లో పోటీ చేస్తా: పెద్దిరెడ్డి

by Sridhar Babu |
Enugala Peddi Reddy latest news
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఇప్పుడే రావని, మరో 6 నెలలు పట్టొచ్చన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. హుజురాబాద్ బీజేపీ టికెట్ కేటాయింపులో అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వెల్లడించారు. ఎవరూ భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్వాగతిస్తానన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు. హుజూరాబాద్‌ను జిల్లా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసినట్లు, టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పెద్దిరెడ్డి తెలిపారు. నేను ఎవరిని కాలువలేదు.. వారు నన్ను పిలువలేదని అన్నారు. బీజేపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో… ఇప్పటిదాకా హుజూరాబాద్ టిక్కెటు ఆశిస్తున్న నేను బయటికి పోతానని ప్రజలు భావిస్తే.. వాళ్లని తప్పు పట్టలేమన్నారు. బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి టికెట్ అడిగే హక్కు ఉంటుందని, కానీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. బీజేపీతోనే ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు.

Advertisement

Next Story