బస్సులు నడపలేని వారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు..

by srinivas |
బస్సులు నడపలేని వారు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు..
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రులతో బూతులు మాట్లాడిస్తే పోలవరం సమస్యకు పరిష్కారం దొరకదని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. హైదరాబాద్ కు బస్సులు నడపలేని వాళ్లు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని దేవి నేని ఉమా అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం, మంత్రులు కనీసం పట్టించుకోలేదని ఆయన అన్నారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో రూ. 7500 కోట్లు నష్టాన్ని సీఎం జగన్ చేకూర్చారని అన్నారు. కేసుల భయంతో పోలవరం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. రైతులకు రాష్ట్రానికి జగన్ తీవ్ర ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు.

Advertisement

Next Story