వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ ఫస్ట్ :బాబుమోహన్

by Shyam |
వాడుకొని వదిలేయడంలో కేసీఆర్ ఫస్ట్ :బాబుమోహన్
X

దిశ, దుబ్బాక :
తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని వాడుకొని వదిలి పెట్టింది సీఎం కేసీఆర్ అని.. అందులో మొదటి బాధితుడు రఘునందన్ రావు అని మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తరపున బాబుమోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కరోనాలా ఎవరికీ కనబడడని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. మంత్రి హరీష్ రావు ముంపు బాధితులను భయభ్రాంతులకు గురి చేసి భూములు గుంజుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో తాను ఎమ్మెల్యే గా ఉన్నానని ముంపు బాధితుల తరపున మాట్లాడలేకపోయానన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రధానమంత్రికి దగ్గరికి తీసుకెళ్ళే నాయకుడు రఘునందన్ రావు అన్నారు. ఇక్కడే పుట్టి పెరిగి.. మీకు అందుబాటులో ఉండే నాయకుడు రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని బాబుమోహన్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed