- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ఈఎస్ఐలో 900 కోట్ల కుంభకోణం… అచ్చెన్నాయుడి పాత్ర?
తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగాన్ని కుదిపేసిన ఈఎస్ఐ కుంభకోణం తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఈఎస్ఐలో కూడా కుంభకోణం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించింది. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కార్మికులకు ఉచితంగా ఇచ్చే మందుల్లో ఈ కుంభకోణం చోటుచేసుకున్నట్టు చెబుతున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి 900 కోట్ల రూపాయల వరకు కాజేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కుభకోణానికి ఎవరైతే పాల్పడ్డారో వారే ఇందులో కూడా ప్రధాన సూత్రధారులని తెలుస్తోంది. ఈ మేరకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఒక నివేదిక విడుదల చేసింది.
గడచిన ఆరేళ్ల కాలంలో 900 కోట్ల రూపాయలకుపైగా మందుల కొనుగోళ్లలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని చెప్పింది. ఈఎస్ఐ ఆసుపత్రులకు మందులు సరఫరా చేయాలంటే.. రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలు మాత్రమే చేయాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా నకిలీ కొటేషన్లు సృష్టించి రేట్ కాంట్రాక్ట్‌లో లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈఎస్ఐ మందుల కొనుగోలు కోసం ప్రభుత్వం 89 కోట్లు విడుదల చేస్తే..అందులో 38 కోట్ల రూపాయలను మాత్రమే రేట్ కాంట్రాక్ట్‌లో ఉన్న సంస్థలకు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రేట్ కాంట్రాక్ట్ లేని సంస్థలకు… అది కూడా వాస్తవ ధరకంటే 132 శాతం అధికంగా చెల్లించి 51 కోట్లను దారి మళ్లించినట్టు గుర్తించింది.
ఇందులో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్లు రవి కుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్‌లోపాటు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు, ఫార్మసిస్టులు, సీనియర్ అసిస్టెంట్లు ఈ స్కాంలో ప్రముఖపాత్ర పోషించారని విజిలెన్స్ విభాగం చెబుతోంది. అంతే కాకుండా ఈ స్కాంలో అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఏమన్నా ఉందా? అంటూ అధికారులు ఆరాతీయడం విశేషం. అప్పట్లో అచ్చెన్నాయుడు అనుయాయులకు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ కంపెనీకి మందుల కొనుగోలు కాంట్రాక్టు అప్పగించాలంటూ డైరెక్టర్లకు లేఖరాసినట్టు తెలిసిందని అధికారులు చెప్పారు. అంతే కాకుండా ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లకు 239 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తే.. అచ్చెన్నాయుడి చొరవతోనే 975 కోట్ల ముందులు కొనుగోలు చేసినట్టు విజిలెన్స్ వెల్లడించింది. ఇందులో ప్రభుత్వానికి సుమారు 404 కోట్ల నష్టాన్ని కలిగించినట్టు తెలుస్తోంది.
ఇందులో 100 కోట్ల రూపాయలకుపైగా నకిలీ బిల్లులు చూపినట్టు ఆరోపణలున్నాయి. లెజెండ్ ఎంటర్‌ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు లాబ్ కిట్ల కొనుగోళ్ల పేరిట 85 కోట్ల రూపాయలను ఆ డైరెక్టర్లు చెల్లించారు. మందుల కొనుగోళ్లలో అవకతవకలతో పాటు ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు, బయోమెట్రిక్ యంత్రాల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ మెషీన్ ధర 16,000 రూపాయలుండగా, ఒక్కో బయోమెట్రిక్ మెషీన్‌కి 70,000 రూపాయలు చొప్పున చెల్లించినట్టు అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా, 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు కాగా, 8 కోట్ల రూపాయల ధర మాత్రమే చెల్లించి, మిగిలిన నిధులను మింగేసినట్టు విజిలెన్స్ విభాగం భావిస్తోంది. దీంతో దీనిపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.