- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాంపరింగ్‌కు అవకాశం లేదు : ఆరోరా
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని, దీనిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరికాదన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారన్న వార్తలను పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. త్వరలోనే రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల కోడ్‌పై చర్చిస్తామన్నారు. అప్పుడప్పుడు వాహనాలు మొరాయించినట్టు.. ఈవీఎంలలో కూడా సమస్య తలెత్తుతుందని అన్నారు. అంతేకానీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం లేదని, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని, ఇప్పుడు బ్యాలెట్ పేపర్‌కు వెళ్లే ప్రసక్తే లేదని సునీల్ ఆరోరా తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల వినియోగాన్ని సమర్థించిన విషయాన్ని సునీల్ ఆరోరా గుర్తు చేశారు.