కరోనా లక్షణాలుంటే భయపడకండి : డీఎంహెచ్‌ఓ

by Shyam |
DMHO Manohar
X

దిశ, సిద్దిపేట: ప్రతిఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ మనోహర్ అన్నారు. గురువారం ఆయన కార్యాలయంలో యాక్షన్ ఎయిడ్ సంస్థ రూపొందించిన కొవిడ్ అవగహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. యాక్షన్ ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ప్రచార యాత్ర చేయడం అభినందనీయమన్నారు. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.

కరోనా లక్షణాలు ఉంటే భయపడకుండా సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టు చేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ వేసుకొని నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ పి.శంకర్, టీజీపీఏ జిల్లా అధ్యక్షుడు మెట్ల శంకర్, డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, సామాజిక కార్యకర్త భీమ్ శేఖర్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story