మాస్క్ లేకుండా బయట తిరిగితే జరిమానా: చైర్‌పర్సన్ మర్రి దీపిక

by Sampath |   ( Updated:2021-12-03 05:42:41.0  )
marri deepika
X

దిశ,మేడ్చల్ : మేడ్చల్ పట్టణ ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను శుక్రవారం చైర్‌పర్సన్ మర్రి దీపిక నర్సింహా రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్క్ తప్పక ధరించాలని, అలా కాకుండా ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా పూర్తిగా కనుమరుగు కాలేదని, ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కేసులు మన దేశంలోనూ బయటపడ్డాయని అన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందుతుందని, ఈ వేరియంట్ నుండి బయటపడాలంటే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరు రెండు డోసుల వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహా రెడ్డి ,కౌన్సిలర్ కౌడే మహేష్ ,కో ఆప్షన్ మెంబర్ మహబూబ్ అలీ ,వైద్య సిబ్బంది మల్లీశ్వరి , సింధు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed