నువ్వు మెయ్యి.. నేను కాపలా ఉంటాను.. వీటి స్నేహానికి అందరూ ఫిదా!

by Sridhar Babu |   ( Updated:2021-08-14 06:31:39.0  )
నువ్వు మెయ్యి.. నేను కాపలా ఉంటాను.. వీటి స్నేహానికి అందరూ ఫిదా!
X

దిశ, పాలేరు: ఎటువంటి లాభం ఆశించకుండా, ఇతరల కోసం ఆలోచించేది, సహాయం చేసేది స్నేహితులు మాత్రమే, అలాంటి స్నేహ బంధం మనుషుల మధ్యే కాదు మూగ జీవాల మధ్య కూడా ఉంటుదని మరోసారి రుజువైంది. ఆ మూగజీవులు.. ఒక దున్నపోతు కుక్క. ఇవి వేర్వేరు జాతులకు చెందినవే అయిన తమ జాతి వైరాన్ని పక్కనపెట్టి ఒకదానితో ఒకటి ఎంతో ఆప్యాయంగా మసులుకుంటున్న దృశ్యాన్ని శనివారం దిశ తన కెమెరాలో బంధించింది.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఆరు గేదెలు ఉన్నాయి. వాటిలో ఒక దానికి దున్నపోతు పుట్టగా బాబూరావు అని పేరు పెట్టాడు. తన కుక్క పిల్లకు ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు పెట్టి సాకుతున్నాడు. అయితే ఇవి రెండూ చిన్నతనం నుంచి కలిసి ఉండేవి. ఒకదానిని ఒకటి విడిచి ఉండేవి కావు. గేదెలు, దున్నపోతు అలియాస్ బాబూరావు మేతకు అడవికి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి బాగా గోల చేసేది. దీనితో బాబూరావుతోపాటు ఝాన్సీ లక్ష్మీబాయి కూడా అడవికి బాబూరావు పైన కూర్చొని వెళ్ళేది. శనివారం పాలేరు సమీపంలో పచ్చిక బయిళ్ళల్లో మేస్తున్న బాబురావుపైన కూర్చొని ఝాన్సీ లక్ష్మీబాయి సవారీ చేస్తుంది. వీటి స్నేహాన్ని చూసి కొంత అంతర్మథనంలో పడడం అటుగా వెళ్ళేవారి వంతైంది.

Advertisement

Next Story

Most Viewed