గ్రామాల వారీగా టోకెన్లు జారీ చేయాలి: కలెక్టర్ అబ్దుల్ అజీం

by Shyam |

దిశ, వరంగల్: రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని‌ అధికారులను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం ఆదేశించారు. బుధవారం ఘన్‌పూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. చెల్పూరు, గొల్లపల్లి పీఏసీఎస్, బస్వరాజ్‌పల్లి ఐకేపీ, ధర్మారావుపేటలో రైతుమిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు గ్రామాల వారీగా జారీ చేసిన టోకెన్ల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు. ధాన్యంలో తాలు లేకుండా తూర్పార పట్టాలని, నిబంధనల మేరకు తేమ ఉండేలా ధాన్యం ఆరబెట్టాలని సూచించారు. ధాన్యం అమ్మడానికి వచ్చిన రైతులు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ధర్మరావుపేట గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి తాగునీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రైస్ మిల్లులు తక్కువ ఉన్నందున పెద్దపల్లి జిల్లాలోని మిల్లులకు వరి ధాన్యాన్ని రవాణా చేయాలన్నారు.

Tags: rice must purchase, collecter mohammed ajim orders, boopalapally, purchase center

Advertisement

Next Story

Most Viewed