- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక్కడ ప్రతి రోజు ‘టీచర్స్ డే’నే.. ఎందుకంటే..?
దిశ, పలిమెల : సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 5న పాఠశాలలో టీచర్స్ డే జరుపుకుంటాం. టీచర్స్ డే రోజున విద్యార్థులే టీచర్లుగా మారి విద్యను నేర్పే పండుగ రోజుగా ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుండిపోయే రోజు. అయితే ఈ టీచర్స్ డే నాడు జరిగే విధంగా వరంగల్ జిల్లాలోని పలు పాఠశాలల్లో రోజూ జరుగుతోంది. అదేంటి అనుకుంటున్నారా.. చెప్తాను.. మండలంలోని మారుముల ప్రాంతాల పాఠశాలల లో ఉపాధ్యాయులు కరువయ్యారు. మండల వ్యాప్తంగా 13 పాఠశాలలకు ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. టీచర్లు పాఠశాలల విధులకు రాకపోగా బూర్గుడెంలో పాఠశాలకు తాళం వేశారు. వెంచంపల్లి పాఠశాలలో ప్రారంభం నుండి ఉపాధ్యాయులు లేరని విద్యార్థులే విద్యను బోధిస్తున్నారు. నీలంపల్లి, ముకునూర్ పాఠశాలలకు ఉపాధ్యాయులు రాకపోయినా విద్యార్థులే పాఠాలు చెప్పుకుంటున్నారు. పిల్లలందరికీ విద్యనందించే టీచర్లు లేక పాఠశాలల్లోని పెద్ద తరగతి విద్యార్థులు చిన్న పిల్లలకు పాఠాలు బోధించవలసిన పరిస్థితి ఉంది.
ఆయా పాఠశాలలకు జిల్లా అధికారులు కొంతమంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పై పంపించి నప్పటికీ పాఠశాలలకు రాకపోవడంతో కొన్ని పాఠశాలలు మూతపడిపోయాయి. ప్రతి ఒక్కరికీ చదువును అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండగా అది మాత్రం పలిమెల మండలంలో నెరవేరడం లేదు. విద్య ప్రాథమిక హక్కు అని రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఆ హక్కును పలిమెల మండలంలోని బాలబాలికలకు అందటం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు విద్య కోసం వెచ్చిస్తున్నప్పటికీ పలిమెల మండలంలో మాత్రం విద్యా వ్యవస్థ తీరు అధ్వానంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు అంటున్నాయి. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటున్నప్పటికీ, పలిమెల మండలంలోనీ తల్లిదండ్రుల కోరిక నెరవేరడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి విద్యాధికారులు స్పందించి పాఠశాలలకు ఉపాధ్యాయుల వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.