‘సింధియా.. బావిలో దూకమన్నా, దూకేస్తా’

by Shamantha N |
‘సింధియా.. బావిలో దూకమన్నా, దూకేస్తా’
X

బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు.. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకే బలంగా మద్దతిస్తున్నామని అన్నారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ నుంచి తమకు హానీ పొంచి ఉన్నదని, కేంద్ర బలగాల భద్రత అవసరమున్నదని తెలిపారు. రెబల్ ఎమ్మెల్యే ఇమార్తి దేవి మాట్లాడుతూ.. ‘జ్యోతిరాదిత్య సింధియా మా నాయకుడు. ఆయన మాకెంతో నేర్పాడు. నేను ఆయనతో గత 20 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నా. ఎప్పటికీ అతని వెంటే ఉంటా. ఒకవేళ ఆయన బావిలో దూకమన్నా.. దూకేస్తా’ అని చెప్పుకొచ్చారు.

Tags: madhya pradesh crisis, congress rebel MLAs, jyotiraditya scindia, bangalore, jumped in well, Imarti devi

Advertisement

Next Story