అఖండ సినిమా చూసిన అఘోరాలు.. ఎక్కడంటే! 

by srinivas |   ( Updated:2021-12-04 03:58:49.0  )
akhanda
X

దిశ, ఏపీ బ్యూరో : అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా థియేటర్లలో వసూళ్ల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య నటించిన అఘోరా పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అఘోరాగా బాలకృష్ణ నటన.. శివతాండవంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అఘోరాలు కూడా అఖండ సినిమా చూసి పరవశించిపోయారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో అఘోరాలు సందడి చేశారు. థియేటర్లో సినిమా చూస్తూ హల్‌చల్ చేశారు. థియేటర్‌లో అఘోరాలను చూసిన ప్రేక్షకులు ఓరేంజ్‌లో ఎంజాయ్ చేశారు.

అఘోరాలు సైతం బాలయ్యకు ఫ్యాన్స్ అయిపోయారంటూ కేకలు వేశారు. సినిమా అయిపోయిన తర్వాత అఘోరాలు థియేటర్ వద్ద కాసేపు కూర్చున్నారు. బాలయ్య అభిమానులు వారితో ముచ్చట్లు పెట్టారు. అనంతరం శివ నామం పలుకుతూ అఘోరాలు అక్కడ నుంచి బయటకు వెళ్లిపోయారు.

అఖండ సినిమాలోని ఆ ఎద్దుల చరిత్ర ఏంటంటే?

Advertisement

Next Story