- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లకు EVDM రెస్క్యూ టీమ్
దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గతవారం రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కరుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం పూర్తిగా జలమయం అయ్యింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఈవీడీఎం(ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్) రెస్య్కూ టీమ్ సభ్యులను సిరిసిల్ల పట్టణానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 40 మంది సహాయక సిబ్బందితో పాటు అధునాతన పరికరాలను, బోట్లను పంపించినట్లు ఈవీడీఎమ్ డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వీరంతా ఆ జిల్లా అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యల్లో పాల్గొననున్నారు.
DRF teams being deployed with Boats & equipment to Sircilla on the instructions of Minister MA&UD @KTRTRS . They will assist the district administration in Rescue & Relief operations in view of the incessant rains and flooding. @arvindkumar_ias @CommissionrGHMC @TelanganaCMO pic.twitter.com/h17x7ECMzA
— Director EV&DM, GHMC (@Director_EVDM) September 7, 2021