పెట్రోల్ బంక్ ఓపెన్ చేస్తున్నారా..? అయితే ఇది తప్పనిసరి

by  |
E-Charjing1
X

దిశ, వెబ్‌డెస్క్: భారత కొత్త సరళీకృత పెట్రోల్ పంప్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్రం మార్పులు చేసింది. కొత్త ఇంధన సరళీకృత పెట్రోల్ పంప్ లైసెన్స్ నిబంధనల ప్రకారం.. ఇకమీదట కొత్తగా ప్రారంభమయ్యే పెట్రోల్, డీజిల్ స్టేషన్లలో అమ్మకాలకు ముందే సీఎన్‌జీ, ఈవీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, బయోఫ్యూయెల్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇంధన సరళీకృత చర్యల్లో భాగంగా పెట్రోల్ బంకుల సంఖ్య పెంచేందుకు ఇంధనేతర కంపెనీలకు లైసెన్స్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. పెట్రోల్ బంకుల సంఖ్య, ఏ ఏ ప్రాంతాల్లో ఉండాలనే అంశాలను అనుసరిస్తేనే కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వనున్నారు. రిటైల్ పెట్రోల్ పంప్ నిబంధనలను అనుసరించి కనీసం 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వరకు మారుమూల ప్రాంతాల్లో నిర్వహించాలి. అంతేకాకుండా సీఎన్‌జీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) ఛార్జింగ్, బయోఫ్యుయెల్ లాంటి కొత్త ఇంధన సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మూడేళ్లకు ప్రతిపాదించిన రిటైల్ ఔట్‌లెట్లలో వీటిని ఏర్పాటు చేయాలి.

Advertisement

Next Story