టీఆర్ఎస్ ప్రచారంలో ఈటల నినాదం.. షాకైన హరీష్ రావు..!

by Anukaran |   ( Updated:2023-12-17 16:19:16.0  )
etala-harish
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి హరీష్ రావు, గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డిలు ఒక్కసారిగా షాక్‌‌కు గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాంపెయిన్‌లో భాగంగా ప్రచార రథం మీద ఉన్న ఓ కార్యకర్త కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ.. ఆ తర్వాత ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదం చేశారు. ఈ నినాదం విన్న అక్కడి మంత్రి హరీష్ రావు, గెల్లు శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా షాక్ అయినట్టు వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పలువురు నెటిజన్లు బీజేపీ విజయం లాంఛనం అయిందని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed