ఇక ఇంటి వద్దనే కరోనా టెస్టులు : ఈటల

by Anukaran |   ( Updated:2020-07-29 06:48:38.0  )
ఇక ఇంటి వద్దనే కరోనా టెస్టులు : ఈటల
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణకు ప్రభుత్వం టెస్టుల్లో వేగం పెంచింది. దీనిలో భాగంగా మంత్రి ఈటల రాజేందర్ కోఠిలో మొబెల్ కరోనా టెస్టింగ్ వ్యాన్లను ప్రారంభించారు. అనంతరం కరోనా టెస్టింగ్ ల్యాబ్ లను పరీశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి కరోనా లక్షణాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి పైసా ఖర్చు లేకుండా వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. మొబెల్ టెస్టింగ్ వ్యాన్లతో బస్తీలు, కంటోన్ మెంట్ జోన్లలో ర్యాపిడ్ టెస్టులు చేయనున్నట్లు చెప్పారు. ఇంటి వద్దకే వచ్చి తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని ఆస్పత్రుల్లో కలిసి రోజుకు 16 వేల టెస్టులు చేస్తున్నట్లు ఈటెల తెలిసారు. లక్షణాలు లేకపోతే హోం ఐసోలేషన్ లో ఉంచుతున్నామన్నారు. 81 శాతం మంది కరోనా నుంచి సులువుగా కోలుకుంటున్నారని చెప్పారు. కేవలం 5 శాతం మందికే ఆక్సిజన్ అందించడంతోపాటు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమన్నారు.

Advertisement

Next Story

Most Viewed