వ్యాక్సిన్ వేస్టేజీ వ్యాఖ్యలపై స్పందించిన ఈటెల

by Shyam |
వ్యాక్సిన్ వేస్టేజీ వ్యాఖ్యలపై స్పందించిన ఈటెల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ వృథా అవుతుందని, అర్హులను గుర్తించి ఇవ్వడం లేదంటూ ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజి కావడం లేదని, 10శాతంపైగా వేస్టేజీ జరిగినట్లు మోదీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు.

తెలంగాణలో అర్హులను గుర్తించి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు ఈటెల స్పష్టం చేశారు. కాగా ఏపీ, తెలంగాణ, యూపీలో 10శాతానికిపైగా వ్యాక్సిన్ వేస్టేజీ అయినట్లు తమ దగ్గర సమాచారం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story