- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధం చేయండి.. వైద్య సిబ్బందికి ఈటల కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేవరకు వైద్య సిబ్బంది యుద్ధవాతావరణంలో పని చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. బుధవారం వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాప్తితో పాటు మరణాల సంఖ్యను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ఉన్న డాక్టర్ల వరకు వైరస్ సోకిన వారిని గుర్తించి.. నివారణ మార్గాలు అన్వేశించాలన్నారు. టెస్టింగ్, ట్రీటింగ్, ట్రాకింగ్, వాక్సినేషన్‌లతో పాటు, ఇతర సేవలు కూడా అందిస్తున్న వైద్య సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రజల ఆరోగ్యం కోసం ఇంతగా శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి అవసరమైన పర్సనల్, ప్రొఫెషనల్ కేర్ ఎక్విప్‌మెంట్‌ను కూడా సకాలంలో అందేలా చూడాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌ను మంత్రి ఈటల ఆదేశించారు. కరోనా పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాల్లో టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. ముఖ్యంగా కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూడాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది పేషెంట్లను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి.. నివారణపై అవగాహన కల్పించాలని ఈటల సూచించారు. సీరియస్‌గా ఉన్న పేషెంట్లను మాత్రమే ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన అంబులెన్సులకు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని నొక్కిచెప్పారు. అలాగే, కరోనా మృతులను వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. ఎక్కడ ఇబ్బందులు రాకూడదని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
ప్రజల్లో అప్రమత్తత అవసరం..
కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో వైద్య సిబ్బందితో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వేగంగా ఉందని.. గుంపులుగా తిరగడం మానుకోవాలని సూచించారు. కరోనా మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని చెప్పారు. ప్రతీ ఒక్కరికి కూడా కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాగ్రత్త పడడం మరింత మంచిదని ఈటల రాజేందర్ హితవు పలికారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రెజ్వి, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, నిపుణుల కమిటీ సభ్యులు, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.