కరోనా నివారణకు చర్యలు: ఈటల

by vinod kumar |
కరోనా నివారణకు చర్యలు: ఈటల
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారితో, తర్వాత మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారితో వ్యాప్తి ఎక్కువగా జరిగిందన్న ఆయన ఇప్పుడు వలస కూలీల కారణంగా వైరస్ పెరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోడ్డు మార్గంలో వచ్చిన వలస కూలీలకు ఆయా రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు హోం క్వారెంటైన్‎లో ఉంచుతున్నారని చెప్పారు. బయటినుంచి వచ్చిన వారిని గుర్తించి గ్రామాల్లోనే హోం క్వారెంటైన్ చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ సడలింపు వల్ల ఎక్కువమంది బయటికి వస్తున్నారని.. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed