- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటల చేరికకు వారంలో ముహూర్తం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమయింది. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఈటలతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఈటల వ్యవహారంలో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప అనారోగ్యంతో ఉన్న అమిత్‌షా నుంచి ఇంకా అపాయింట్మెంట్ రాకపోవడంతో వెయిటింగ్లో ఉన్నట్లు సమాచారం.
మంగళవారం అమిత్‌షా అపాయింట్మెంట్ వస్తే భేటీ అవుతారని, అనంతరం ఢిల్లీ నుంచి హుజూరాబాద్ చేరుకున్న తర్వాత తన అనుచరులతో ఈటల సమావేశం అవుతారని ఈటల వర్గీయులు చెప్పుతున్నారు. అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారంటున్నారు. అయితే ముందుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారని బీజేపీ నేతలు చెప్పుతున్నారు. ఐదారు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈటల ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ పార్టీ కూడా నిశితంగా గమనిస్తోంది. ఈటల బీజేపీలో చేరిన తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగనున్నాయనే రాజకీయ చర్చ కూడా సాగుతోంది.
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారా… లేకుంటే కరోనా పరిస్థితుల తర్వాతే ఉంటుందా అనేది కొంత చర్చగా మారింది. కానీ ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ దీనిపై ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం రాజీనామా చేయనని, కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాతే రాజీనామా ఉంటుందన్నారు. కానీ బీజేపీలో చేరిన తర్వాతే రాజీనామా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.