ఈటల వర్గం కౌంటర్ : మీరు ఒకటి చేస్తే మేం వంద చేస్తాం

by Sridhar Babu |   ( Updated:2021-06-25 05:36:42.0  )
ఈటల వర్గం కౌంటర్ : మీరు ఒకటి చేస్తే మేం వంద చేస్తాం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖ ఫేక్ అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లెటర్ టీఆర్ఎస్ నకిలీ ముఠా మరో సృష్టి అని, ఈటల రాజేందర్ పాత లెటర్ హెడ్‌లోని అక్షరాలను మార్చేసి ఫేక్ లెటర్ సృష్టించారని ఆరోపించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిచే దమ్మూ, ధైర్యం లేక కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో తెలంగాణ డిజిటల్ మీడియా ఇలాంటి వికృత చర్యలకు పూనుకుంటోందని ఈటల వర్గీయులు ఆరోపించారు.

‘అరేయ్ టీఆర్ఎస్ కుక్కల్లారా మీరు ఒకటి చేస్తే మేం వంద చేస్తాం’ అని హెచ్చరిస్తూ కౌంటర్ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఫేక్ లెటర్‌ను ట్రోల్ చేస్తుండటంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో సరికొత్త చర్చకు దారి తీసింది.

ఆ లేఖపై ఈటల రియాక్షన్ ఇదే… అసలు ఆ లేఖ లీక్ చేసింది సాధవ రెడ్డేనా..?

Advertisement

Next Story